‘తుంబాద్’ సినిమా విజయం తర్వాత బాలీవుడ్ నటు డు, నిర్మాత సోహమ్ షా తన తాజా చిత్రంతో ప్రేక్షకుల్ని క్రేజీ రైడ్‌కి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మామ్’, ‘కేసరి’ చిత్రాల ఫేమ్ గిరీశ్ కోహ్లీ రచనాదర్శకత్వంలో సోహమ్ షా కొత్త సినిమా రాబోతోంది.
ఈ సినిమాకు ‘క్రేజీ’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రాన్ని సోహమ్ షా, ముఖేష్ షా, అమిత సురేశ్ షా, ఆదేశ్ ప్రసాద్ నిర్మించారు. ఫిబ్రవరి 28న థియేటర్లలోకి వస్తోంది. తాజాగా మేకర్స్ ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
టీజర్‌ను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్న విషయాన్ని ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు వెల్లడించారు. ‘మేము ఒక క్రేజీ రైడ్ కోసం సిద్ధంగా ఉన్నాం! రేపు టీజర్ డ్రాప్ అవుతుంది. క్రేజీ రైడ్ ప్రారంభం కానుంది. సరికొత్త ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి’ అని పేర్కొన్నారు.