calender_icon.png 11 January, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 205 బిలియన్ డాలర్లు

19-10-2024 12:00:00 AM

ఆర్బీఐ సర్వే 

ముంబై, అక్టోబర్ 18: భారత్ నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 205.3 బిలియన్ డాలర్ల సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఎగుమతులు జరిగాయని తాజాగా విడుదలైన రిజర్వ్ బ్యాంక్ సర్వేలో వెల్లడయ్యింది. విదేశీ కంపెనీలు భారత్‌లో నెలకొల్పిన సబ్సిడరీల ద్వారా జరిగిన ఎగుమతులు కూడా ఇందు లో కలిసి ఉన్నాయి. అంతక్రితం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన 200.6 బలియన్ డాల ర్ల విలువైన సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఎగుమతులు జరిగాయి.

వీటితో పోలిస్తే 2023-24లో 2.8 శాతం వృద్ధిచెందాయి. దేశం నుంచి జరిగిన సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో అత్యధికంగా యూఎస్‌కు 54 శాతం చేరాయి. భారత్ నుం చి సాఫ్ట్‌వేర్ సేవల్ని అందుకుంటున్న ప్రాంతం యూరప్ (31 శాతం)కాగా, అందులో ప్రధానంగా యూకేకు చేరుతున్నాయి.