calender_icon.png 25 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ బలవన్మరణం..

25-10-2024 12:25:08 PM

ఏడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య 

పని ఒత్తిడే కారణం అని అనుమానం 

మృతుడు ఆంధ్రప్రదేశ్ తణుకు వాసి 

కోకాపేట్ లో విషాదం..

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకపేట్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తాను ఉంటున్న హాస్టల్ ఏడో అంతస్థు పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ తణుకు ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఇన్ టచ్ సంస్థలో కొంతకాలంగా పనిచేస్తున్నాడు. అతడు కోకపేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా అతడు శుక్రవారం ఉదయం హాస్టల్ లోని ఏడో అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నాగ ప్రసాద్ రూమ్ మేట్స్ తో పోలీసులు మాట్లాడి వివరాలు సేకరించారు. పని ఒత్తిడి కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణా రెడ్డి పేర్కొన్నారు.