calender_icon.png 21 March, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిట్ అండ్ రన్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

21-03-2025 01:05:03 AM

 బైకుపై స్వగ్రామానికి మృత్యు ఒడికి

రాజేంద్రనగర్, మార్చి 20 ( విజయక్రాంతి): గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పారిపోవడంతో యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందిన విషాదకర సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి కథనం ప్రకారం..వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కెరెల్లి గ్రామానికి చెందిన కమ్మరి రాములు కుమారుడు నవీన్ చారి (25) నగరంలోని గచ్చిబౌలి లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. గురువారం తెల్లవారు జామున 3:30 గంటలకు అతడు బైకుపై గచ్చిబౌలి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పుప్పాలగూడ గ్రామంలోని టి గ్రిల్ జంక్షన్ దగ్గరికి రాగానే గుర్తు తెలియని వాహనం ఆయన బైక్ను ఢీకొట్టడం తో నవీన్ చారి కిందపడిపోయాడు.

ఆయన ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటికి నవీన్ చారి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చేతికి అందికి వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నవీన్ చారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.