25-04-2025 12:15:31 AM
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): వరకట్న వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరివేసు కొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జగిత్యాలలో చోటుచేసుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపం లో ప్రసన్న లక్ష్మి అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మ హత్య కు పాల్ప డింది. మృతురాలికి రెండు సంవత్స రాల క్రితం వెల్గటూరు మండలం రామ్నూ రుకు చెందిన తిరుపతితో వివాహం జరిగింది.
భార్య భర్తలు ఇద్దరు బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాగా వీరికి ఒక సంవత్సరం క్రితం కుమారుడు జన్మించాడు. అయితే కొద్దిరోజులుగా వరకట్నం కోసం అత్తింటి వారు వేదింపులకు పాల్పడుతుండటంతో ఇటీవల పుట్టింటికి వచ్చింది. మానసిక వేదనతో కృంగిపోతున్న ప్రసన్న లక్ష్మి రాత్రి బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడింది.
తన కుమారుని బాధ్య త తండ్రి తీసుకోవాలని, అత్తవారింటికి పంపవ ద్దంటూ అద్దంపై రాసి ఆత్మ హత్యకు పాల్పడడం పలువురిని కలచివే సింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.