26-04-2025 05:41:59 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకుపాముల శివారులో లారీ ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి. వివరాలలోకి వెల్లగా... చెడే యశస్విని(24) సొంత గ్రామం తుందూరు, భీమవరం మండలం పశ్చిమగోదావరి జిల్లా, గత 3 సంవత్సరాల నుండి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హాస్టల్ లో ఉంటుంది. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయం చేస్తుంటారు. మృతురాలు తన నాన్నకు బుల్లెట్టు బండి కొనుగోలు చేసి ఆ బుల్లెట్ తన నాన్నకు బహుమతిగా ఇవ్వడానికి తన ఇంటికి తీసుకు వెళ్లడానికి తన తోటి ఎంప్లాయ్ బడ్డుకొండ అచ్యుత్ కుమార్ తో కలిసి ఇద్దరు తుందూరు గ్రామం బయలుదేరినారు.
రాత్రి సమయంలో ఆకుపాల గ్రామ శివారు ప్రాంతాల్లో అంతకుముందే రోడ్డు మీద చనిపోయి ఉన్న గేదెకు బుల్లెట్ తగలగా మృతురాలు రోడ్డు మీద పడిపోగా అదే సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న లారీ అదుపుతప్పి ఢీకొనగా యశస్విని అక్కడికి అక్కడే చనిపోయినది. బుల్లెట్ నడుపుతున్న అచ్యుత్ కుమార్ కూడా స్వల్ప గాయాలు తగిలినవి. మృతురాలు బాబాయి చాడే సురేష్ ఫిర్యాదు మేరకు మునగాల పోలీస్ స్టేషన్ ఎస్యచ్ఓ దార వెంకటరత్నం ఏఎస్ఐ కేసు నమోదు చేయనైనది. మునగాల సీఐ పర్యవేక్షణలో డెడ్ బాడీ పంచనామా నిర్వహించి ఫిర్యాదుదారునికి అప్పగించారు.