హైదరాబాద్,(విజయక్రాంతి): రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ముందు వెళ్తున్న బైకును కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శ్రీవాణి(21) అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. గాయపడ్డిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలు శ్రీవాణి కామారెడ్డి జిల్లా వాసిగా గుర్తించిన రాయదుర్గం పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.