హైదరాబాద్: మణికొండలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మృతి చెందాడు. మణికొండలో గణేశుడి దగ్గర ఆదివారం లడ్డూ వేలం పాట జరిగింది. అల్కాపురి టౌన్‌షిప్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ శ్యామ్ ప్రసాద్ విజయవంతంగా వేలం వేసి రూ.15 లక్షలకు లడ్డూను తీసుకున్నాడు. దానికి సంతోషించిన శ్యామ్ ప్రసాద్ గణేష్ మండపం వద్ద కాసేపు డ్యాన్స్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి శ్యామ్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్యామ్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దురదృష్టకర సంఘటన శ్యామ్ ఇంట్లో విషాదం మిగిల్చింది. అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.