* కుటుంబ తగాదాలే కారణం!
* అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
* అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో విషాదం
పటాన్‌చెరు, జనవరి 6: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని బంధంకొమ్ము శ్రీరాం హిల్స్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అమీన్‌పూర్ ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపిన మేరకు వివరాలు.. మంచిర్యాలకు చెందిన చెట్టికీర్తి (34) హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన జంగిలి సందీప్(36)తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
వీరికి కూతురు గగనహిత(3), ఏదాదిన్నర బాలుడు సాకెత్‌రామ్ ఉన్నారు. గత కొంతకాలంగా దంపతు అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము శ్రీరాం హిల్స్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉ చేస్తున్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య కలహాలు చో చేసుకుంటున్నా సోమవారం కూతురు పుట్టినరోజు ఉండటంతో ఈ విషయంలో ఆదివారం సాయంత్రం భార్య భర్తల మధ్య గొడవ జరిగింది.
గొడవ జరిగిన అనంతరం భర్త ఇంటినుంచి బయటకు వెళ్లి కొంతసేపటి తర్వాత ఇంటికి తిరిగిరాగా భార్య కీర్తి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉంది. ఇది చూసిన భర్త సందీప్ కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్ సీఐ సదా నాగరాజు, ఎస్‌ఐ సోమేశ్వరి సిబ్బందితో పరిశీలించారు. కీర్తి తండ్రి చెట్టి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.