calender_icon.png 4 January, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు బడుల్లో సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ

30-12-2024 02:04:52 AM

  1. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయొచ్చు
  2. కన్హా శాంతివనం సందర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి
  3. స్కిల్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన 
  4. ధాన్యకేంద్రంలో మొక్క నాటిన ముఖ్యమంత్రి

రంగారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియ ల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ఫలితంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిచడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయొచ్చన్నారు.

షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మం డలంలోని కన్హా శాంతివనాన్ని సీఎం ఆదివారం సందర్శించగా.. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాంతివనం ఫౌండర్ కమలేశ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వనంలో విద్యార్థులకు అందిస్తున్న సాఫ్ట్‌స్కిల్స్‌కు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

సాఫ్ట్‌స్కిల్స్ ద్వారా పొందిన ప్రతిభను విద్యార్థులు సీఎం ఎదుట ప్రదర్శించారు. కళ్లకుగంతలు కట్టుకొని వివిధ రకాల రంగులను గుర్తించడం, పదాలను చదవడాన్ని చూసి వారిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ కేంద్రాన్ని సందర్శించారు.

అక్కడ వివిధ రకాల మేలు రకాలైన వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా శాంతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్‌ను సందర్శించిన అనంతరం ధ్యాన కేంద్రంలో మొక్కను నాటి కలియతిరిగారు.

అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ శాంతివనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు  శ్రీనివాసరాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.