calender_icon.png 14 March, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ముందడుగుతోనే సమాజం వృద్ధి

13-03-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ గంగాధర్ 

యాదాద్రి భువనగిరి, మార్చి 12 (విజయక్రాంతి) : మహిళలు ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉంది  మహిళా సాధికారతకు తోడ్పడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు. బుధవారం రోజు కలెక్టరేట్  సమావేశం మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో లింగ సమానత్వం, మహిళా సాధికారత, సాధించాలనీ, మహిళల హక్కులను కాపాడడం సామాజిక, సాంకేతిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించాలని, విద్య, ఉపాధి భద్రత వంటి రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం

ద్వారా మహిళలు ముందుంటారని, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వావలంబన, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు, ఒక మహిళ విజయవంతురాలు అయితే కుటుంబంతో పాటు సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని, మహిళల మేధాశక్తి చాలా గొప్పదన్నారు. ఒక్కాపుడు మహిళలు కంటే  ఇప్పుడు మహిళలు అన్ని రంగాలల్లో ముందు ఉంటున్నారన్నారు..

మహిళా సంక్షేమం కోసం మహిళ స్త్రీ సంక్షేమ  శాఖ ద్వారా అమలు అవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ  పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎడగలన్నారు.  మహిళా సంఘాల ద్వారా  జిల్లాలోని మహిళలు ఆర్థికంగా  ఎదగలన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేజ్ చిస్తీ మాట్లాడుతూ అమ్మను పూజించాలి , భార్యను గౌరవించాలి అన్ని విధాలుగా మహిళలను అభివృద్ధి చెందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపన్యాసాలు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ప్రదర్శన, మహిళ ఉత్తమ ఉద్యోగులకు బహుమతుల ప్రధానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభ రాణి , జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, సఖి కేంద్రం నిర్వాహకురాలు ప్రమీల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, జిల్లా పౌర సంబంధాల అధికారి అరుంధతి, జిల్లా ట్రెజరీ అధికారికి సంపూర్ణ,  జిల్లా ఉపాధి కల్పనాధికారి సాహితీ, సీడీపీఓ లు.జ్యోత్స్న.శైలజ.స్వరాజ్యం. రమ. శశికళ.జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది..మహిళా సాధికారత టీం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.