calender_icon.png 18 April, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరబోసిన పంటను పరిశీలించిన సోసైటీ చైర్మన్

11-04-2025 07:05:12 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ శివారులో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అకాల వర్షం రావడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. తడిచిన పంటను గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని 161వ జాతీయ రహదారిపైన రైతులు ఆరబెట్టిన పంటను మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ పరిశీలించారు. అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న పంట ఆరబెట్టడానికి ఎక్కడ స్థలం లేక జాతీయ రహదారిపైకి తీసుకురావడం రైతులు ఆరబెట్టి కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. అకాల వర్షంతో మొక్కజొన్న రైతన్నలకు ఇబ్బందులు పడవలసి వస్తుందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.