calender_icon.png 3 April, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

01-04-2025 06:43:51 PM

మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.. 

పెన్ పహాడ్: సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నట్లు సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజిపురం గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఈ సన్న బియ్యం కార్యక్రమం పేదలకు పెద్ద పండగ అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, తహసిల్దార్ లాలూ నాయక్, ఆర్ఐ రంజిత్ రెడ్డి, నాయకులు పిన్నేని కోటేశ్వరరావు, చింతం వెంకటేశ్వర్లు, వై. వెంకటేశ్వర్లు, గజ్జల సైదిరెడ్డి, పసుపులేటి వెంకన్న, జానీ మియా, మల్సూర్, కారింగుల రాజు, దామోదర్ రెడ్డి, విజయ్ రెడ్డి, భరత్ రెడ్డి, కృష్ణారెడ్డి, అనుములపురి నాగయ్య, కృష్ణ, చెన్ను జయమ్మ, వెంకటనర్సు, నాంపల్లి సైదులు, ముస్తఫా, షేక్. సైదులు తదితరులు ఉన్నారు.