04-03-2025 07:10:09 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో భారతీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు ఈ మనోజ్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన నిర్మల్ లో మాట్లాడారు. జిల్లాస్థాయిలో మండల గ్రామీణ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యా వైద్యం సామాజిక అంశాలపై పేదలకు చేయూతను అందించేందుకు కృషి చేయడం జరుగుతుంది అన్నారు. నిర్మల్ జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సేవా భవంతు పనిచేసే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సేవాపరులు సభ్యులు చేసుకోవాలని ఆయన సూచించారు.