calender_icon.png 18 April, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే

11-04-2025 03:01:05 PM

ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు

పెన్ పహాడ్: సమాజంలో సమాన హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు( Mahatma Jyotirao Phule Jayanti) సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా పలువురు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం తన  జీవితాన్ని అంకితం చేసిన  మహనీయుడు అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ రవి, ఈసీ చందా మహేష్,కార్యదర్శులు శివ, నాగరాజు, ఏక స్వామి,  బుచ్చన్న అనూష, రామ్ కుమార్ వెంకన్న, నాగయ్య, తదితరులు ఉన్నారు.