10-04-2025 01:24:18 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 9 : సీసీ కెమెరాలతో ప్రజలకు సామాజిక రక్షణ లభిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని సూర్యా నగర్ లో కాలనీవాసులు దాదాపు 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... అభివృద్ధి విషయంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజలు స్వంత నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమ న్నారు. నేర రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యమని, ఇందుకు అనుగుణంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశలవారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగహన కలి్పాంమన్నారు.
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని, ఒకవేళ నేరం జరిగితే నేరం చేసినవారిని గంటల వ్యవధిలో పోలీసులు పెట్టుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్ గౌడ్, మల్లేశ్ ముదిరాజ్, భాస్కర్ సాగర్, కాలనీ సంఘం అధ్యక్షుడు ఆనంతుల వెంకటేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి,
ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజేందర్ రెడ్డి, సభ్యులు శంకరయ్య గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, స్వామి గౌడ్, నాయకులు లక్ష్మణ్, ఇంద్రకరణ్ రెడ్డి, రాకేశ్, మనోజ్, విష్ణు, నగేశ్, పరమేశ్, శ్రీరాములు, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.