calender_icon.png 19 April, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియా సైనికులే కాంగ్రెస్‌కు బలం

16-04-2025 01:59:04 AM

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి):  కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావ డానికి ముఖ్య కారకులు సోషల్ మీడియా సైనికులే అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామ ల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు, మంగళవారం పెద్దఅంబర్‌పేటలోని తన క్యాంప్ కార్యాల యంలో భువనగిరి పార్లమెంట్ సోషల్ మీడియా సైనికులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు, ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై వారికి దిశా నిర్దేశం చేశారు,

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజాపాలన అందిస్తుందనీ  సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, 500 కు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువకులకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం ఇలా పలు రకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రజల కోసం పనిచేస్తుందనీ వీటన్నిటి గురించి ప్రతీ కాంగ్రెస్ కార్యక్తర గ్రామాల్లో విసృతంగా ప్రచారం చెయ్యాలని సూచించారు,

ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా పార్టీ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, పనిచేసిన గారికి ఖచ్చితంగా సరైన సమయంలో సరైన పదవులు, సము చితమైన గౌరవం ఇస్తుందని తెలిపారు, రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కంకణబబద్దులు కావాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో పలు నియోజకవర్గాల నుండి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు