calender_icon.png 15 October, 2024 | 5:54 AM

విద్యారంగంపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం

15-10-2024 01:12:12 AM

టీఎస్ యూటీఎఫ్

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): విద్యా రంగంపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోందని, విద్యార్థులు దు ష్ప్రభావానికి గురవుతున్నారని టీఎస్ యూటీఎఫ్ అభిప్రాయపడింది. సోమవారం నాగటి నారా యణ వర్దంతి సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ‘విద్యారంగంపై మీడియా ప్రభా వం’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ విలువల తో కూడిన విద్యా స్థానంలో కార్పొరేట్ కల్చర్, డబ్బు ప్రభావం పెరు గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూఢత్వం, అశాస్త్రీయ ఆలోచనల భావజాలం పెరుగుతుందని, ఇది భవిష్యత్తు తరానికి ప్రమాదకరంగా మారునుందన్నారు.

ఇలాం టి ప్రభావాలను అరికట్టాల్సిన అ వసరం ఉందన్నారు. విద్యా విధానంలో సైంటిఫిక్ భావజాలాన్ని పెంచడానికి  ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి, కోశాధికారి లక్ష్మారెడ్డి, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.