calender_icon.png 28 November, 2024 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్

28-11-2024 03:59:11 AM

బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా

కాన్‌బెర్రా, నవంబర్ 27: తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు రావడంతో తమ దేశంలో 16 ఏళ్ల లోపు చిన్న పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ బుధవారం ఆమో దం తెలిపింది. ఒకవేళ ఈ బిల్లును సెనెట్ కూడా ఆమోదిస్తే చట్టంగా మారుతుంది.

అప్పటినుంచి చిన్నపిల్లల సోషల్ మీడియాపై వాడకంపై నిషేధం అమలులోకి వస్తుంది. ఈమేరకు బుధవారం ఈ బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లుకు 102 మంది ఆమోదం తెలుపగా, 13 మంది వ్యతిరేకించారు. ఈ వారంలోనే ఈ బిల్లు చట్టంగా మారితే చిన్నపిల్లలకు సోషల్ మీడి యా వాడకంపై నిషేధం అమలులోకి వస్తుం ది.

దీంతో పిల్లలు సోషల్ మీడియా ఖాతా లు వాడకుండా 12 నెలల్లో ఆయా కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లలో మార్పులు చే యాల్సి ఉంటుంది. సోషల్ మీడియా అకౌంట్లను వినియోగించకుండా ఏజ్ పరిమితిని నిర్ధారించడానికి ఆయా సంస్థలకు ఏడాది సమయం ఇవ్వనున్నారు. ఒకవేళ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే సోషల్ మీడియా సంస్థలపై రూ.273 కోట్లు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.