16-04-2025 01:11:58 AM
పదవుల్లో సామాజిక న్యాయం పాటించాలి
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పేదొకటైతే.. సీఎం రేవంత్‌రెడ్డి చేసేదొకటని రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొ.తిరుమలి అన్నారు. బీసీ ఇంటలెక్చవల్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిం చిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వే షన్లు కల్పిస్తూ చట్టం చేయడం హర్షణీయమన్నారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామా జిక న్యాయం ద్వారా పదవుల్లో అవకాశం కల్పించాలన్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణనలో 56.36శాతం బీసీలున్నారని తేల్చినా ఏ రంగంలోనూ బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది 56 సంస్థలకు రాష్ట్ర ప్ర భుత్వం కార్పొరేషన్ చైర్మన్‌లను నియమించగా అందులో 23మంది రెడ్లు, కమ్మలు 2, బ్రాహ్మణ 3, ఎస్సీలు 6, ఎస్టీలు 3, ముస్లిం లు 5, క్రిస్టియన్లు 1, ఉండగా బీసీలు మంది మాత్రమే ఉన్నారన్నారు.
సమావేశంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ చైర్మన్ అశోక్ , ఓబీసీ జాక్ చైర్మన్ డా.వేణు కుమార్, ఏఐఓబీసీస్‌ఏ వ్యవస్థాపకులు జి.కిరణ్ కుమార్, అడ్వకేట్ జేఏసీ యే షాల శ్రావణ్ కుమార్, పిడికిలి రాజు, కెవి గౌడ్, కొండల్ గౌడ్, ఘోర శ్యాంసుందర్, చెన్న శ్రీకాంత్, మహిళా నాయకురాలు ఉ పేంద్ర, ఉస్మానియా విద్యార్థి జేఏసీ వీరమ ల్లు యాదవ్ పాల్గొన్నారు.