calender_icon.png 5 February, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

04-02-2025 10:39:41 PM

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య...

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణ కేంద్రంలో లక్షలాది డప్పులు వేలాది గొంతుల కరపత్రాలను ఎక్స్ ఎమ్మెల్యే, పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య మంగళవారం ఆవిష్కరించటం జరిగింది. అనంతరం మాట్లాడుతూ... పిబ్రవరి 7న హైదరాబాద్ నడి బొడ్డున జరిగే మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శనను ప్రపంచం మొత్తం మాదిగల వైపు చూసే విదంగా చిర్రలు, చిటికెడు పుల్లలతో డప్పులతో హైదరాబాద్ రాజధానిలో ఎన్నడూ జరగని రీతిలో పెద్దలు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుకు మాదిగ, మాదిగ ఉపకులాలు ఎర్రని ఎండలో గుండెమీద డప్పు పెట్టి కొట్టడానికి మాదిగలు సిద్ధం కావాలని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ కట్టుబడి ఉందని, ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనగారిన కులాల హక్కుల కోసం నిరంతరం తపిస్తుందని అన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాలు చేసిన న్యాయ పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు, భద్రాచలం మండలం ఇంచార్జ్ అలవాల రాజా మాదిగ పెరియార్, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేకల లత, జిల్లా ఉపాధ్యక్షులు కొచ్చర్ల కుమారి, కొప్పుల నాగమణి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గొడేటి వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్, యూత్ కాంగ్రెస్ భద్రాచలం మండలం ఉపాధ్యక్షులు కొడుతూరి ప్రేమ్ సాయి, వరుణ్, సాంబశివరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు.