21-03-2025 01:56:48 AM
పార్టీ మండలాధ్యక్షుడు సైదులు
మునుగోడు, మార్చి 20 : సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మునుగోడు మండలాధ్యక్షుడు భీమనపల్లి సైదులు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుల ఆమోదంపై సంతోషం వ్యక్తం చేస్తూ గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మాదిగ జాతి చిరకాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, నాయకులు దోటి నారాయణ, మిర్యాల వెంకన్న, జాల వెంకన్న, మాధగోని రాజేశ్గౌడ్, పందుల భాస్కర్, జిట్టగోని యాదయ్య, పాల్వాయి జితేందర్, చెరుకు వెంకన్న, ఆరెళ్ల సైదులు, వనం యాదయ్య, కుంభం చెన్నారెడ్డి, మేకల మల్లయ్య, అప్పారావు, యాదయ్య, పండ్ల బండి సైదులు, బుచ్చపోతుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.