20-03-2025 08:40:58 PM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు...
మునుగోడు (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు బీసీ కులగణన నిర్వహించి, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అయిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు అన్నారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన మంత్రివర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనర్సింహ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి మాట్లాడారు.
దశబ్దాలుగా సుదీర్ఘమైన డిమాండ్లను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, మాదిగ జాతి సోదరుల చిరకాల డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి, దోటి నారాయణ, మిర్యాల వెంకన్న, జాల వెంకన్న, మాధగోని రాజేష్ గౌడ్, పందుల భాస్కర్, జిట్టగోని యాదయ్య, పాల్వాయి జితేందర్, చెరుకు వెంకన్న, ఆరెళ్ళ సైదులు, వనం యాదయ్య, కుంభం చెన్నారెడ్డి, మేకల మల్లయ్య, అప్పారావు, యాదయ్య, పండ్ల బండి సైదులు, బుచ్చపోతుల నరసింహ, పోగుల ప్రకాష్, బుచ్చపోతుల శ్రీను, జనిగల ముత్యాలు, యాదగిరి, కృష్ణ, రామ్ రెడ్డి, రవి, చంద్రయ్య, కృష్ణ, వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.