calender_icon.png 15 November, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోనే సామాజిక న్యాయం

09-09-2024 01:57:37 AM

  1. పీసీసీ చీఫ్ రెడ్డిలకిస్తే ముందు వరుసలోనే ఉంటా 
  2. బీసీల అభివృద్ధి కోసం నెహ్రూ, ఎన్టీఆర్ కృషి 
  3. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మూడు ప్రధాన పదవుల్లో మూడు కులాలకు ప్రాధాన్యత కాంగ్రెస్ కల్పించిందని ఆయన తెలిపా రు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఉంటే.. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గం నుంచి మహేశ్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించిందని జగ్గారెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహిస్తూ పీసీసీ పదవి రెడ్డి సామాజిక వర్గానికి  ఎప్పుడిచ్చి నా జగ్గారెడ్డి పేరు ప్రధానంగా ఉంటుందని, తన ఆలోచన మారదన్నారు.

పీసీసీ పదవి రేసులో బీసీల నుంచి మహేశ్ కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, ఎస్టీల నుంచి బలరామ్‌నాయక్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు వినబడినా చివరకు పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన మహేశ్‌వైపే అధిష్టానం దృష్టి సారించి ఎంపిక చేసిందన్నారు. బీజేపీలో ఎప్పుడు పదవి ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియదని, ప్రాంతీయ పార్టీలల్లో తండ్రీ లేదంటే కొడుకులే అధ్యక్షులవుతారని ఆయ న వ్యాఖ్యానించారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్‌కు ఏఐసీ సీలో పదవి ఇవ్వాలని ఆయన కోరారు. ఆర్థికంగా, బలహీనంగా ఉన్న కులాలు అభివృద్ధి చెందేలా నెహ్రూ, ఇందిరా గాంధీలు నిర్ణయాలు తీసుకున్నారని జగ్గారెడ్డి తెలిపారు. వెనుకబడిన కులాల అభివృద్ధికి విత్తనం నాటింది నెహ్రూనేనని అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బీసీల కోసం పనిచేశారని ఆయన పేర్కొన్నారు. 

గాంధీభవన్‌లో గణపతి పూజలు..

వినాయక చవితి సందర్భంగా గాంధీభవన్‌లో గణపతిని ఏర్పాటు చేయగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, అధికార ప్రతినిధి కొనగాల మహేశ్, సంగిశెట్టి జగదీశ్ తదితరులు హాజరై పూజ లు నిర్వహించారు.