calender_icon.png 21 October, 2024 | 8:50 PM

భూమితోనే దళితులకు సామాజిక న్యాయం

29-07-2024 12:20:55 AM

ప్రొఫెసర్ కాసిం

రాజన్న సిరిసిల్ల, జూలై 28(విజయక్రాంతి): దళితులకు భూమి ఉంటేనే సామాజిక న్యాయం దక్కుతుందని ఉస్మానియా నివర్సిటీ ప్రొఫెసర్ కాసిం అన్నారు. దళిత హక్కుల పోరాట సంఘం ఆధర్యం లో ఆదివారం సిరిసిల్లలో ‘దళితులు సామాజిక న్యాయం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయి సదస్సులో ఆయన మాటాడారు. దేశ జనాభాలో సుమారు 22 శాతం ఉన్న దళితులకు భూమి లేదన్నారు. తెలంగాణ రాష్ర్టంలో అనేక పోరాటాలు భూమి కోసమే  జరిగాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 2,120 ఎకరాల భూమిని దొరలు, భూసాములు ధరిణి పేరుతో లాక్కున్నారని ఆరోపించారు. గత ప్రభుతం లో దళితుల నుంచి అభివృద్ధి పేరుతో లాగేసుకున్న భూములను తిరిగి ఇవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుతం నేరెళ్ల బాధితులకు న్యాయం జరగలేదని, కాంగ్రెస్ ప్రభుతమైనా వారికి న్యాయం చేయాలని కోరా రు. సమావేశంలో డీహెచ్‌పీఎస్ రాష్ర్ట ప్రధాన కార్యద రి మారుపాక అనిల్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదరి గుడి వేణు, రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.