ప్రతిపక్షాలపై ఫైర్ అయిన కోదాడ కాంగ్రెస్ నేతలు..
కోదాడ (విజయక్రాంతి): భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని బీసీ కులగణన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ్ నేతృత్వంలో బీసీలకు న్యాయం జరిగిందని కోదాడ కాంగ్రెస్ సీనియర్ నేతలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఉత్తమ్ దంపతులకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెచ్చింది సోనియా గాంధీ అని అన్నారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో బీసీ కులగణన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఓర్వలేక తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు సర్వే చేసి చేతులు దులుపుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల కాలంలో కులగణన అధికారులతో అంగన్వాడి టీచర్లతో పూర్తిస్థాయిలో నివేదికను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ భాయ్, సైదుబాబు, శ్రీను, సూర్యనారాయణ, బాగ్దాద్, వెంకటేశ్వర్లు, షరీఫ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.