10-03-2025 01:10:33 AM
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధా న కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారా ల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ ముగ్గురు అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు.
పార్టీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (ఎస్సీ మాల), పార్టీ సీనియర్ నాయ కురాలు, మాజీఎంపీ విజయశాంతి (బీసీ), నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌కు (ఎస్టీ లంబాడి) ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన జారీ చేసింది.
అయితే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, అసెంబ్లీ లో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాం గ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు దక్కనున్నాయి. మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక స్థానం కేటాయించింది. సోమవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో నామినేషన్లు వేయనున్నారు. కాగా, అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ అధిష్ఠానం పెద్దలు రాష్ట్ర నాయకులతో కీలక చర్చలు జరిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిపారు. ఎమ్మెల్సీ సీటు కోసం పదుల సంఖ్యలో పోటీపడ్డారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన వారు, నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వారి పేర్లను పరిగణలోకి తీసుకోవద్దని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటించారు.
ఉమ్మడి నల్లగొండకు రెండు..
ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఎమ్మె ల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించగా, వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.
2024 ఎన్నికల్లో మందుల సామేల్‌కు టికెట్ ఇవ్వడం వల్ల అద్దంకి దయా కర్‌కు టికెట్ ఇవ్వడం కుదరలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. నల్లగొం డ డీసీసీ అధ్యక్షుడు ఎస్టీ సామాజికవ ర్గానికి శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. అద్దంకి దయాకర్‌ను ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి, శంకర్‌నాయక్ పేరును మా జీ మంత్రి జానారెడ్డితో పాటు మంత్రు లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక విజయశాంతి పేరును పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకున్నది.
అన్ని కోణాల్లో ఆలోచించే అభ్యర్థుల ప్రకటన: పీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పార్టీ అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆలోచించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారిని ప్రకటించిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ తెలిపారు. ఎస్టీ లంబాడా సామాజికవర్గానికి చెందిన శంకర్ నాయక్ 30 ఏళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. అద్దంకి దయాకర్ కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై పోరాటం చేశారన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రత్యేక రాష్ట్ర పోరాట నాయకురాలు విజయశాంతికి టికెట్ ఇవ్వడం సంతోషకరమన్నా రు.