కోరుట్ల, డిసెంబర్ 28 (విజయ క్రాంతి) : గ్రామాల్లో అభివృద్ధి పనులు నాణ్యతతో చేయాలని, పూర్తి స్థాయిలో మొక్కల సంరక్షణ చర్యలు తీసుకోవాలని జగిత్యాల డీఆర్డీవో రఘువరన్ సూచించారు. శనివారం కోరుట్ల పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి మార్చి 2024వరకు 15వ విడత సోషల్ ఆడిట్ చేశారు. దీనికి గానూ రూ. 23473 రికవరిగా రావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ తనిఖీలో అడిషనల్ డీఆర్డీవో మదన్, ఏడివో దేవేందర్ రెడ్డి, అంబుడ్స్మెన్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, యంపిఒ కృపాకర్, ఎస్‌ఆర్పి సాయిలు, పీఆర్‌ఎఈ సుచరిత్, ఎపీవో మమత, సీవో రాజేందర్, టీఎఓలు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.