సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలను ఊపేక్షించొద్దు
డీజీపీ జితేందర్ స్పష్టం
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రౌడీలు, ఇతర సామాజిక వ్యతిరేకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. మహిళలు, పిల్లలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలపై ఊపేంక్షించవద్దని చెప్పారు. రోడ్ సేప్టీని కూడా మెరుపర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అర్థ వార్షికానికి సంబంధించిన క్రైమ్‌పై సీపీలు, ఎస్పీలు, జోనల్ ఐజీలు, రేంజ్ డీఐజీలతో మంగళవారం డీజీపీ రివ్యూ చేశారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందని, మరణాలను తగ్గించడానికి సరైన చర్యలు తీసుకునేందుకు హాట్‌స్పాట్‌లను గుర్తించడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని సూచించారు.
డయల్ 100కు వచ్చే కాల్స్‌కు సంబంధించి సమయాన్ని మెరుగుపర్చాలని అన్నారు. నేరాల హాట్‌స్పాట్‌లను గుర్తించడం, వాటిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన అంశాలపై ఏడీజీపీ శిఖా గోయెల్ వివరించారు. సమావేశంలో పోలీసు ఉన్నధికారులు శివధర్‌రెడ్డి, అభిలాష బిష్ట్, విజయ్‌కుమార్, సంజయ్‌కుమార్ జైన్, వీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.