27-02-2025 12:00:00 AM
ఆధునిక ప్రపంచంలో కాలం తెచ్చే మార్పులకు లోకం నిరంతరం ప్రభావితమవుతుంది. నేడు కొత్తగా, వింత గా అనిపించిన వస్తువు కొన్నాళ్లకు పాతదవుతుంది. ఒకప్పుడు ఆశ్చర్యకరంగా అని పించిన పనులు ఈరోజు సర్వసామాన్యం గా కనిపిస్తాయి. తన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవా ల్సిన అవసరం ప్రతి మనిషికీ ఉంది. కొం తమందికి శాస్త్రజ్ఞానం కొరవడినా లోకజ్ఞా నం పుష్కలంగా ఉంటుంది. దాంతో వారు వ్యక్తుల స్వభావాన్ని గుర్తెరిగి నడుచుకుం టూ తమ పనుల్ని చక్కబెట్టుకుంటారు.
ఇదంతా ఒకరు నేర్పిస్తే వచ్చే విద్య కాదు. సమాజాన్ని పరిశీలించడం ద్వారా తనంతట తానుగా నేర్చుకునేది. భారతదేశంలో విద్య ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతుంది, దేశంలోని మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల నిష్పత్తి సుమారుగా 10:3. ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో దాదాపు 73 శాతం మంది అక్షరా స్యులు ఉన్నారు. వీరిలో పురుషులు 81 శాతం, మహిళలు 65 శాతం ఉన్నారు. జాతీయ గణాంక కమిషన్ 201718లో అక్షరాస్యత 77.7శాతం పురుషులలో 84.7శాతం, స్త్రీలలో 70.3శాతంగా పేర్కొంది. భారతదేశంలో తులనాత్మకంగా యువ జనాభానుంచి ప్రయోజనం పొం దడం కొనసాగించడానికి ఈ సవాలు ను అధిగమించాల్సిన అవసరం ఉంది. పర్యటనలు, పుస్తకాలు లోక పరిశీలనకు రెండు కళ్లులాంటివి. ఏ కన్నుతో చూసినా సమాజం పట్ల కనీస అవగాహన కలగాలి. అది లేనప్పుడు మనిషికి ఉండాల్సిన లౌకిక జ్ఞానం కరువవుతుంది.
చదువుకు దూరమవుతున్న చిన్నారులు
పేదరికం, తల్లిదండ్రుల అనాసక్తత ఇతర కుటుంబ కారణాల వల్లదేశం లో చాలామంది పిల్లలు అర్ధాంతరంగా చదువులకు దూరం అవుతున్నారు. పేదరికం, కుటుం బ సంబంధిత కారణాలవల్ల ఇండియాలో చాలామంది పిల్లలు చదువును మధ్యలో నే వదిలేసి పోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో డ్రాప్‌అవుట్ రేటు సగటున 1.9 శాతం ఉంటే, మాధ్యమిక స్థాయిలో అది 5.2 శాతంగా ఉంది.
ఈ రెండింటితో పోలిస్తే సెకండరీ స్థాయిలో డ్రాపవుట్ 14.1 శాతంగా నమోదయింది. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సెకండరీ స్థాయిలో డ్రాపవుట్ రేటు జాతీ య స్థాయికంటే మరింత ఎక్కువగా ఉంది. జీవితంలో స్థిరపడడానికి విద్య ఎంతగానో దోహదపడుతుంది. సమాజంలో ఎలా మెలగాలో నేర్పుతుంది. పేదరికం, కుటుం బ సంబంధిత కారణాల వల్ల భారత్‌లో చాలామంది పిల్లలు మధ్యలోనే చదువును వదిలేసిపోతున్నారు.
సంస్కారానికి చోటు లేని ప్రణాళికలు
విద్య సామాజిక వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఎంతగానో దోహదపడుతుంది. నేటి ఆధునిక చదువు కేజీ నుం డి పీజీ స్థాయి వరకు అనేక ఒడిదుడుకులకు గురవుతుంది. ఒకే దేశం, ఒకే పాఠ్య ప్రణాళిక అన్న నినాదం 2020లో తీసుకొచ్చిన నూతన విద్యా విధానం పూర్తిస్థాయిలో ఆశించిన మేర అమలు కాలే దని చెప్పాలి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు వినియోగించుకుంటూ శాస్త్రీ య విజ్ఞానం కోసం ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. నేటి ఆధునిక సమాజంలో విద్య అనేక మార్పులను తీసుకువస్తుందని సభ్య సమాజం ఎదురుచూస్తున్న తరుణం లో మానవ విలువలు, సంస్కారం ఎంతో అవసరం. అయితే నేడు వీటిని బోధించే అవకాశం లేకుండా పోతోంది. దీనికి ప్రధానమైన కారణం ఆధునిక పోకడల మధ్య నలుగుతున్న విద్యావ్యవస్థ.
అటు కేంద్రం, ఇటు రాష్ట్ర పరిధిలో నిర్వహించబడుతున్న విద్య, పాఠ్యప్రణాళిక విద్యార్థులలో మానవీయ విలు వలు పెంపొందించే దిశగా లేవన్న విషయాన్ని విద్య మేధావులు గుర్తించారు. సాంకేతికం గా ఎంతో అభివృద్ధి సాధించిన విద్యలో సంస్కారం లేకపోతే బూడిదలో పోసిన పన్నీరు లాగానే అవుతుంది. కేంద్ర ప్రభు త్వం 2020లో తీసుకువచ్చిన నూతన విద్యా వ్యవస్థ పాఠ్యప్రణాళిక శాస్త్రీయ విద్యా విధానానికి దూరంగా ఉంది. ప్రస్తు త అవసరాలకు అనుగుణంగా విద్యను రూపకల్పన చేయాల్సిన పరిస్థితు లు ఉన్నప్పటికీ వీటికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు పొందుపరుస్తున్నారు. చరిత్ర నుండి వర్తమానానికి బాటలు వేయడానికి విద్య ఉపయోగపడుతుంది.
అయితే వాస్తవ చరిత్రను దాచి పెట్టే విధంగా మన పాఠ్య ప్రణాళిక రూపకల్పన జరుగుతున్నదన్న విమర్శలు లేకపోలేదు. ఆధునిక శాస్త్రీయ విద్యా విధానం వర్తమాన సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి. కానీ దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలను విస్మరించే విధంగా ఆర్థిక సామాజిక అంశాలను ఎక్క డా బోధించడం జరగడం లేదు. కేవలం సాంకేతిక విద్యపైనే దృష్టి కేంద్రీకరించడం, ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఇటువంటి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరు గుతోంది. సామాజిక శాస్త్రాలతో కూడిన విద్యా విధానాన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నామోషిగా ఫీల్ అవుతూ బీఏ అన్న పదా న్ని లేకుండా చేస్తున్నారు.
కేవలం కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడుకున్న విద్యా వ్యవస్థకు ప్రాధాన్య ఇవ్వడం జరుగుతోం ది. ముఖ్యంగా గ్రామీణ సామాజిక జీవన వ్యవస్థపై అధ్యయనం చేసి జీవన పరిస్థితులను మెరుగుపరిచే విధంగా విద్య బోధన ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాం తాల ఆర్థిక సామాజిక జీవన వ్యవస్థకు ముడిపడే విధంగా విద్యా వ్యవస్థను ముఖ్యంగా పాఠ్యప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన వ్యవసాయం, కుటీర పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు ఉన్నా యి. పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ఉన్న పరిస్థితులు మన ముందు కదలాడుతున్నాయి. సాంప్రదాయక జీవన విధానం, కుటీర పరిశ్రమలు పూర్తిగా అడుగంటుతున్నాయి. నేడు ఏ గ్రామానికి వెళ్లినా మల్టీనే షన్ కంపెనీలు ఉత్పత్తి చేసే కోకో కోలా, థమ్సప్ డ్రింక్ బాటిల్స్ దర్శనమిస్తున్నా యి.
అంటే మల్టీనేషన్ కంపెనీలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు మన గ్రామాలకు చేరుతున్నాయి కానీ మన ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వా లు ఆలోచించడం లేదు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ పూర్తిగా సంస్కారం లేని వ్యవస్థగా మారిపోతుంది. సమాజంలో నెలకొన్న అసమానతలు, మానవ విలువలు బోధించడానికి అటువంటి కోర్సులను రూపకల్ప న చేయడానికి ప్రభుత్వంగా ప్రైవేటు రంగ సంస్థలు నిర్లక్ష్యం చేస్తే సమాజం దోపిడీ వ్యవస్థగా మారుతుంది. కాబట్టి వర్తమాన విద్యా వ్యవస్థ సామాజిక అంశాలతో కూడుకున్న విద్యా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డా.రక్కిరెడ్డి ఆదిరెడ్డి