calender_icon.png 22 April, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక కార్యకర్త పాకాల దుర్గాప్రసాద్‌కు సేవారత్న పురస్కారం

21-04-2025 11:36:15 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలో ప్రముఖ కాంట్రాక్టర్, ప్రజాసేవ కార్యక్రమాల లో ముందు ఉండి అన్నింటా నేను వున్న ను అని అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే గుణం కలిగిన మంచి వ్యక్షికి ఒంగోలుకు చెందిన ఎల్ సి ఎఫ్ ఫౌండేషన్  వారు జాతీయ సేవా రత్న అవార్డ్ కి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సోమవారం గృహంలో నిర్వహించిన కార్యక్రమం లో భద్రాద్రి పట్టణ ప్రముఖులు హరితమిత్ర లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు ‌, శ్రీ తాండ్ర రమణ రావు,  డాక్టర్ కృష్ణ ప్రసాద్,  సుబ్బారావ్, ఆదర్శ కుమార్,  శంకర్ రావు, శ్రామిరెడ్డి‌, తిరుమల రావు, అజీమ్, శరత్, వెంకటాచారి,  మూర్తి తదితరులు కలసి శ్రీ పాకల దుర్గా ప్రసాద్ కి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి జాతీయ సేవా రత్న అవార్డ్ ను  అందచేయడం జరిగినది. ఈ సందర్భంగా శ్రీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పేద వారికి సేవ చేయడం నా బాధ్యత అని భవిష్యత్తు లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు భద్రాద్రి మిత్రులతో కలసి నిర్వహిస్తానని తెలియ  చేశారు.