calender_icon.png 11 January, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వామన్ రెడ్డికి ఘన నివాళి

30-12-2024 01:59:30 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చిలుకూరి వామన్ రెడ్డి(Chilukuri Vaman Reddy) చేసిన కృషి మరువలేనిదని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి(Social Activist Mudupu Mounish Reddy) పేర్కొన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే వామన్ రెడ్డి(Former MLA Vaman Reddy) వర్ధంతి కార్యక్రమాన్ని మావల మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు చిలుకూరి మధుసూదన్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శశి కాంత్, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.