calender_icon.png 4 March, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ పరివాహక ప్రాంతంలో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్

04-03-2025 02:19:33 AM

మలక్‌పేట, మార్చి 3: మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా నిరాశ్రయులైన మలక్‌పేటలోని శంకర్‌నగర్ బాధితులను సోమవారం సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పరామర్శించారు. సుందరీకరణ పనుల్లో రివర్‌బెడ్ పరిధిలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. స్థానికులు, నిరాశ్రయులతో మేధా పాట్కర్ మాట్లాడారు.

సమాచారం తెలుసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు అక్కడికి చేరుకుని మేధా పాట్కర్‌ను అడ్డుకున్నారుశంకర్‌నగర్‌లో పర్యటించేందుకు అనుమతి లేదని, మేధాపాట్కర్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవల్సిందిగా కోరారు. మేధా పాట్కర్‌ను అడ్డుకోవడంపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఖండించారు.