ఫ్యాషన్.. ఓ సంద్రం లాంటిది. ఇది ఎప్పటికప్పుడు మారుతూ కొత్తపుంతలు తొక్కుతుంటుంది. ఈ తరం అమ్మాయిల మనసు దోచిన చీరకట్టు.. చాలా రకాలు ఉన్నాయి. వాటిలో డ్రాప్టింగ్ సారీ స్టుల్స్ మగువ మనసును దోచేశాయి. ఈజీగా.. కంఫర్టబుల్‌గా.. ట్రెడిషినల్ వేర్‌లో హుందాగా కనిపించే ఈ చీరాలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. సంప్రదాయాలకు అనుగుణంగా.. వెరైటీ డిజైన్లలో మగువను ఆకట్టుకుంటున్నాయి. అకేషన్ ఏదైనా.. డిఫరెంట్‌గా కనిపించాలంటే కచ్చితంగా ఈ స్టుల్ ఫాలో అయిపోవాల్సిందే..! మరెందుకు ఆలస్యం ఓసారి ట్రై చేసి చూడండి!