- హైదరాబాద్, వరంగల్ తర్వాత గ్రేటర్ దిశగా కరీంనగర్
- ఒక మున్సిపల్, ఐదు గ్రామాలను విలీనం చేస్తూ గెజిట్ విడుదల
కరీంనగర్, జనవరి 18 (విజయక్రాంతి) : కరీంనగర్ నగరపాలక సంస్థ ఇంతింతై వటుడింతై అన్న విధంగా గ్రేటర్ కార్పొరేషన్ దిశగా పయనిస్తోంది. ఆరు సంవత్సరాల క్రితం 8 గ్రామాలు విలీనం కాగా తాజాగా ఐదు గ్రామాలు, కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
కరీంనగర్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 1987 లో రాంపూర్, రాంనగర్ పంచాయతీలను విలీనం చేశారు. ఆ తర్వాత 2018లో 8 గ్రామాలను విలీనం చేశారు. విలీనం అనంత రం 50 డివిజన్లుగా ఉన్న నగరపాలక సంస్థ 60 డివిజన్లుగా మారింది. తాజాగా ఐదు గ్రామాలు, కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనం కావడంతో డివిజన్ల సంఖ్య ఏడు వరకు పెరగ నున్నాయి.
అనధికార లెక్కల ప్రకారం కరీంనగర్ నగర జనాభా మూడున్నర లక్షలకు చేరుకోనుంది. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని బొమ్మకల్, దుర్శేడ్, గోపా ల్పూర్ గ్రామాలు, కొత్తపల్లి మండల పరిధిలోని చింతకుం ట, మల్కాపూర్-లక్ష్మిపూర్ గ్రామాలతోపాటు కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధమవుతున్న తరుణంలో గ్రామాల విలీనం ద్వారా ఐదు పంచాయతీలు, కొత్తపల్లి మున్సిపాలిటీ ఓటర్లు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోకి రానున్నారు.
ప్రత్యేక నిధులు వస్తేనే అభివృద్ధి సాధ్యం..
ప్రస్తుత నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈ ఐదు సంవత్సరాలు స్మార్ట్ సిటీ నిధులు, అమృత్- 1, సీఎం హామీ నిధులు, 14వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆరేళ్ల క్రితం విలీనమైన గ్రామాల్లో అభివృ ద్ధి కార్యక్రమాలు, పాత నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయి. కొత్తగా విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి జర గాలంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటా యిస్తేనే సాధ్యమవుతుంది. స్మార్ట్ సిటీ కాల పరిమితి ఈ మార్చితో ముగియనుంది. కొత్తగా పనులు చేపట్టే అవకాశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో జెండా ఎగురవేయా లంటే కరీంనగర్ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయిం చాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. లేకుంటే విలీన గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది.