calender_icon.png 17 January, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలా న్యూయర్క్ నగరంలో..

02-09-2024 12:00:00 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు ఎంత ప్రయారిటీ ఇస్తా రో.. ఫ్యామిలీకి అంతకంటే ప్రాధా న్యం ఇస్తారు. ఏమాత్రం సమ యం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తూ చిల్ అవుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశాడు. కూతురు సితార ఘట్టమనేనితో ఉన్న ఫోటో అది. అందులో మహేష్ బాబు గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో ఉన్నాడు. న్యూయార్క్ నగర వీధుల్లో ఉన్నట్లుగా ఫోజులిచ్చిన ఈ ఫోటో సోషల్ మీడియా లో కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది. నమ్రతా శిరోద్కర్ కూడా కూతురు సితారతో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు. 

మహేశ్ బాబు దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టునర్ కోసం సన్నద్ధం అవుతు న్నాడు. మహేష్ బాబు ఈ చిత్రంకోసం తన లుక్‌ను పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే.