29-03-2025 11:52:01 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని కస్తూరిబా విద్యాలయంలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులను ఇన్చార్జి ఎస్ఓ చితకబాదిన విషయం శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం మధ్యాహ్నం తమ పిల్లలను చూసేందుకు వచ్చిన విద్యార్థులు గేటు బయట వేచి చూస్తున్నా దాని గమనించిన విద్యార్థినిలు తమ సెల్ ఫోన్ లో ఎస్ ఓ చితకబాదిన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతుండగా వారి దగ్గర నుండి ఎస్ఓ సెల్ తీసుకుంది.
దీంతో విషయం బయటకు పుట్టింది. సమాచారం అందుకున్న భీమిని ఎంఈఓ కృష్ణమూర్తి విచారించగా పదవ తరగతి విద్యార్థులు చదువుకుంటుండగా అల్లరి చేయడంతో తాను వారిని కొట్టినట్లు ఎస్ ఓ ఒప్పుకుంది. దీంతో ఎస్ఓ జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంఈఓ కృష్ణమూర్తి వెల్లడించారు. పాఠశాలలో విద్యార్థులను చితకబాదడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.