అలంపూర్, నవంబర్ 18 : అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం జింకలపల్లి సమీపంలో ఉన్న ఎస్‌ఎన్‌ఎస్ కంపెనీని మూసివేయాలని జింకలపల్లి, కొండేర్, ఎర్రవల్లి గ్రామాల ప్రజలు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజేయుడిని కోరారు. సోమవారం కర్నూల్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో వారు చల్లా, ఎమ్మెల్యేను కలిసి ఎస్‌ఎన్‌ఎస్ కంపెనీ వెదజల్లే కాలుష్యం, వ్యర్థాల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని.. ఆ కంపెనీని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.