calender_icon.png 7 February, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

SNP works should be completed

07-02-2025 07:57:08 PM

హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్.. 

జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు వినతి పత్రం.. 

ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ పరిధిలో ఎస్ఎన్డీపీ నిధులతో మంజూరైన నాలా పనులను వెంటనే చేపట్టాలని కార్పొరేటర్ సుజాతా నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. హస్తినాపురం డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన పనులను వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సుజాత నాయక్ మాట్లాడుతూ.. ఎస్ఎన్డీపీ నిధులు రూ. 12.30 కోట్లు మంజూరయ్యాయని, ఏపీ ఎస్ బీ కాలనీ నుంచి బైరామల్ గూడ చెరువు వరకు నాలా పనులు చేపట్టాలన్నారు. వర్షాకాలం రాకముందే పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య తీరుతుందని సూచించారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులను పూర్తి చేయించాలని కోరారు. వివిధ కాలనీల్లో సమస్యలను పరిష్కరించే విధంగా నిధులు మంజూరు చేయాలన్నారు.  త్వరలో నారా పనులు ప్రారంభించే విధంగా చొరవ తీసుకుంటామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు.