calender_icon.png 19 January, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో మంచు తుఫాన్

17-12-2024 01:20:14 AM

న్యూయార్క్‌లో భారీ హిమపాతం

శాన్‌ఫ్రాన్సిస్కోను తాకిన టోర్నడో

న్యూయార్క్/శాన్‌ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 16: భారీ హిమపాతం, మంచు తుఫానులు, టోర్నడోలతో అమెరికా అతలాకుతలమవుతోంది. న్యూయార్క్, కాలిఫోర్నియా, అయో వా, నెబ్రస్కాతో సహ అనేక ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. న్యూయార్క్‌లో భారీ హిమపాతం కురుస్తోంది. మిడ్‌వెస్ట్ రాష్ట్రాల్లో మంచు తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కోలో టోర్నడో తుఫాన్‌తో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. సెంట్రల్ కాలిఫోర్నియలో టోర్నడో కారణంగా కార్లు కొట్టుకుపోయాయి. వేలాది చెట్లు నేలకూలాయి. అనేక మంది గాయపడడంతో వారిని ఆస్పత్రిలో చేర్చారు. దీంతో దాదాపు 20 ఏళ్ల తరువాత శాన్‌ఫ్రాన్సిస్కోలో టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. 

మరోవైపు న్యూయార్క్‌లో భారీగా మంచు కురుస్తోంది. మిడ్‌వెస్ట్ రాష్ట్రాల్లో మంచు తుఫాను కారణంగా లేక్ తాహు చు ట్టూ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మంచు తుఫాను శనివారం నాటికి అయో వా, తూర్పు నెబ్రాస్కా ప్రాంతాల్లో రోడ్డపై పేరుకుపోయింది. దీంతో ట్రక్స్, కార్లు జారిపోయి ప్రమాదాలు జరుగుతుండడంతో ఇంటర్ స్టేట్ 80ని తాత్కాలికంగా మూసివేశారు. న్యూయార్క్, ఆర్చర్డ్ పార్క్ సమీ పంలో 84 సెంటీమీటర్ల మంచు కురిసింది.

మంచు తుఫాన్ కారణంగా నెబ్రాస్కాలోని ఆర్లింగ్టన్‌లో రోడ్డుపై ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొని ఓ మహిళ(57) చనిపోయారు. మరో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలిఫోర్నియాలో స్కాట్స్ వ్యాలీని టోర్నడో తాకింది. దీంతో కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. చెట్లు, కరెంట్ స్థంభాలు నేలకూ లాయని నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలిపింది. టోర్నడో కారణంగా అనేకమంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత మొదటిసారి టోర్నడో తీవ్ర ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. కాగా వర్షం, గాలుల కారణంగా పశ్చిమ వాషింగ్టన్ రాష్ట్రంలో పదివేల మందికి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.