పీసీసీ అధికార ప్రతినిధి దయాకర్
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): పదేళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్క రోజైనా గురుకులాలను సందర్శించారా? సమస్యలను పరిష్కరించారా అని బీఆర్‌ఎస్ నేతలను పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి గురుకులాల్లో కాస్మోటిక్ చార్జీలు, డైట్ చార్జీలు పెంచడంతో విద్యార్థుల నుంచి వస్తున్న అభిమానాన్ని చూసి బీఆర్‌ఎస్ తట్టుకోవడం లేదని, అందుకే దుష్ప చారం చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ పాలనలో 36 మంది విద్యార్థులు పాముకాట్లకు గురయ్యారని తెలిపారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల నుంచి జేజేలు కొట్టించుకోవడానికే సరిపోయాడని, విద్యార్థులకు చేసిందేమీ లేదని విమర్శించారు.