calender_icon.png 1 November, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో పాముల పుట్టలు

11-08-2024 12:05:00 AM

  1. పెద్దాపూర్ పాఠశాలలో తవినకొద్దీ బయటికి పాములు 
  2. ఇద్దరి మృతితో ఇండ్లకు వెళ్లి పోయిన విద్యార్థులు 
  3. గురుకుల విద్యాలయం ఖాళీ 

జగిత్యాల, ఆగస్టు 10 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు అనుమానస్పద స్థితిలో మృతిచెందడం, గురుకులంలోని పుట్టలను తవ్విన కొద్దీ పాములు బయటకు వస్తుండటంతో విద్యార్థులంతా ఇంటిబాట పట్టారు. దీంతో గురుకులం అంతా ఖాళీ అయింది. ఓ పక్క అధికారుల సందరనలు కొనసాగు తుండగా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

గురుకులంలో 542 మంది విద్యార్థులు 

పెద్దాపూర్ గురుకులంలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 542 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 22మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు. తాటిపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌కు పెద్దాపూర్ పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు అప్పగించారు. క్లాస్ రూంలు తప్పా విద్యార్థులకు, టీచర్లకు వసతి సౌకర్యాలు లేవు. వసతుల కల్పనకు ప్రభుతం నిధులు మంజూరు చేసినా నిధులు విడుదల కాలేదు. ఉపాధ్యాయులు, అధ్యాపకులే తరగతి గదుల నిర్మాణం, క్లాసుల నిరహణకు ఖర్చు చేస్తున్నారు. 15రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద తాత్కాలిక మరమ్మతులు చేపట్టింది. 

పాములతో భయాందోళన

శుక్రవారం గురుకులానికి చెందిన అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శుక్రవారం నుంచి ఆగమేఘాలమీద అధికారులు గురుకుల ఆవరణలో మరమ్మతులు చేపడుతున్నారు. పుట్టలను ధ్వంసం చేస్తున్న తరుణంలో పాములు బయటకు వస్తున్నాయి. దీంతో గురుకుల సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఉదయం మెట్‌పల్లి ఆర్డీవో నక్క శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ గౌతమ్‌రెడ్డి గురుకులాన్ని సందరించారు. పుట్టలను ధ్వంసం చేసే సమయంలో బయటకు వచ్చిన పాములను అధికారులు సైతం గమనించారు. శుక్రవారం ఉదయం ఎక్స్‌కవేటర్‌తో పరిసరాలను శుభ్రం చేస్తున్న క్రమంలో రెండు పాములు కంటపడగా శనివారం ఆరు పాములు బయటపడ్డాయి. 

విద్యార్థుల కుటుంబానికి న్యాయం చేయాలి 

పెద్దాపూర్ గురుకులంలో మృతి చెందిన అనిరుధ్, గుణ ఆదిత్య కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత ఉద్యోగం ఇవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జగిత్యాలలో రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాష్ర్ట హాస్టల్స్ కనీనర్ మారవేణి రంజిత్ కుమార్, కార్యదరి మల్యాల రాకేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు పాముకాటుతో మృతిచెందిన ప్రభుత్వం స్పందించకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 

పొలాల మధ్యే గురుకులం

పెద్దాపూర్ గురుకుల విద్యాలయం చుట్టూ పంట పొలాలు ఉండటం, ప్రహరీ లేకపోవడంతో పాములు గురుకు లంలోకి వస్తున్నాయని గురుకులం సిబ్బంది, ఉపాధ్యా యులు చెబుతున్నారు. విద్యార్థుల మరణాలు పెనువివాదానికి దారి తీయడంతో తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి గురుకుల ఆవరణలోని పుట్టలను కనిపించకుండా చేసేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నట్లుగా స్పష్టమవుతున్నది. 

విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మండిపాటు

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో ప్రభుత్వ గురుకులాల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారని, 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మాట్లాడు తూ.. తమ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని పేర్కొన్నారు. విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సమీక్ష జరపకపోవడం బాధాకరమన్నారు.

సీఎం రేవంత్‌కు రెసిడెన్షియల్ స్కూళ్లపై సదాభిప్రాయం లేదని విమర్శించారు. పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన మొత్తం అమెరికా నుంచే నడుస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సోదరుడు డైరెక్టర్‌గా ఉన్న స్వచ్ఛ్‌బయోతో ఒప్పందం పెద్ద కుంభకోణమని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుప త్రుల్లో డెలివరీల సంఖ్య దారుణంగా పడిపోయిందన్నారు.