03-03-2025 08:37:04 PM
మణుగూరు/పినపాక (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కొప్పాక ప్రాథమికోన్నత పాఠశాలలోని పురాతన బావిలో గత నాలుగు రోజులుగా ఉన్న గోధుమ తాసూ పామును ఎట్టకేలకు సోమవారం స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు. వివరాలు ఎలా ఉన్నాయి. పినపాక మండలంలో గత నాలుగు రోజుల ప్రీతం పాఠశాల పాత బావిలో గుర్తించిన తాసు పామును శ్వేత నాగు అని, మరి కొందరు అరుదైన నాగుపాము అనే సబ్ డివిజన్ వ్యాప్తంగా చర్చ అనే అంశమైంది.
సామాజిక కార్యకర్త బోడ లక్ష్మణరావు సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన సమాచారం మేరకు, పినపాక మండల పంచాయతీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ భార్గవ్ సహాయంతో పామును బయటకు తీశారు. ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ.. అంతరించిపోయే ప్రాణుల జాబితాలో గోధుమ తాచు పాము సైతం ఉందని, వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించొద్దని, ఏ ఇబ్బంది కలిగిన తనకు సమాచారం అందిస్తే తప్పకుండా వచ్చి సహాయం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పినపాక ఎంపీఓ కే.వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.