చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్‌కెప్టెన్ స్మృతి మంధాన రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు బహిర్గతం చేసింది. గత ఐదేళ్లుగా బాలివుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్, డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లు స్మృతి సామాజిక మాద్యమాల వేదికగా వెల్లడించింది. ఐదేళ్ల రిలేషన్‌షిప్‌కు గుర్తుగా స్మృతితో కలిసి కేక్ కట్ చేస్తోన్న ఫొటోలను పలాశ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికింది ప్రేమ చిహ్నంతో పాటు 5 అనే అంకెను జోడించగా.. దీనికి ప్రతిస్పందనగా స్మృతి లవ్ సింబల్ పెట్టి తమ బంధాన్ని బహిర్గతం చేసింది. దీంతో అభిమానులు స్మృతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
29 ఏళ్ల పలాశ్.. టీ సిరీస్, జీ మ్యూజిక్, పాల్ మ్యూజిక్ కోసం పలు ఆల్బమ్‌లు చేశాడు. దీంతో పాటు రిక్షా అనే వెబ్‌సిరీస్, అర్ధ్ అనే సినిమాకు ముచ్చల్ దర్శకతం కూడా వహించాడు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖస్త్రలే హమ్ జీ జాన్‌సే’ చిత్రలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్‌తో కలిసి పలాశ్ నటించాడుకూడా. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పలాశ్ దగ్గర గత కొన్నాళ్లుగా స్మృతి పియానో నేర్చుకుంటోంది.