calender_icon.png 14 March, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూమపానం ఆరోగ్యానికి హానికరం

13-03-2025 12:11:40 AM

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ 

సూర్యాపేట, మార్చి 12 (విజయక్రాంతి): ధూమాపానం ఆరోగ్యానికి హానికరమని సూర్యాపేట జిల్లా గోరెంట్ల ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద బుధవారం జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధూమాపానం  దుర  అలవాటు వలన బిపి, హుద్రోగ స్ట్రోక్, ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులకు గురవుతూ అధికమరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు ధూమపానాన్ని విడనాడాలని కోరుతూ విస్తృత అవగాహన కల్పించారు.

ఇటీవలి కాలంలో అత్యధికమంది సిగరెట్లు, పొగాకు త్రాగడం వలన 70 ప్రమాదకరమైన రసాయన పదార్థాలు, నికోటిన్ విడుదలవుతూ క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ధూమపా నానికి అలవాటు పడటం వలన ప్రాణవాయు స్థాయి తగ్గి అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. కావున ధూమాపానానికి స్వస్తి పలకడం ద్వారా బీపీ స్ట్రోక్, ఊపిరితిత్తులు మెరుగు పడతాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.