calender_icon.png 27 December, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లుల కోసం ఎస్ ఎంసీ చైర్మన్ ల ధర్నా

03-12-2024 04:51:06 PM

మెదక్ (విజయక్రాంతి): మన ఊరి, మనబడి కింద చేసిన బిల్లులు రాలేవని ఎస్ఎంసి చైర్మన్లు ధర్నాకు దిగారు. మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాల ముందు నిరసన చేపట్టారు. బిల్లులు ఇవ్వనందుకు ప్రభుత్వ బాలికల కళాశాలకు తాళం వేయడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్.. చేసిన పనికి ఇప్పటివరకు బిల్లులు రాలేదని ఆందోళన.. ఉపాధ్యాయులు, విద్యార్థులను పాఠశాల లోనికి వెళ్ళనివ్వకుండా ధర్నా.. తాము చేసిన పనికి బిల్స్ ఇప్పిస్తానని హామీ ఇస్తే తప్ప ఉపాధ్యాయులను విద్యార్థులనులోనికి పంపుతామని భీష్మించడంతో విద్యాధికారులు స్పందించి అక్కడికి చేరుకొని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.