12-02-2025 02:01:05 AM
కరీంనగర్ సిటీ, ఫిబ్రవరి11: స్మార్ట్ సిటి ప్రాజెక్టుల పనులన్నీటిని మార్చి ఎండింగ్ వరకు పూర్తి చేసేలా పీఎంసి, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీస్కోవాలని కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఆదేశించారు. కరీంనగర్ స్మార్ట్ సిటి కార్పోరేషన్ లిమిటెడ్ అభివృద్ధి లో భాగంగా మంగళవారం రోజు నగరపాలక సంస్థ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్మార్ట్ సిటి లో చేపట్టిన వివిధ రకాల ప్రాజెక్టు పనుల పై సుదీర్ఘంగా చర్చించారు.
చేపట్టిన ప్రాజెక్టులలో పూర్తున ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తున ప్రాజెక్టులకు చెల్లించిన బిల్లుల వివరాలను కూడ అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న డిజిటల్ లైబ్రరీ, కార్ఖానగడ్డ బాలసదభవనం, కాశ్మీర్ గడ్డ సమీకృత మార్కెట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ భవనం, పద్మానగర్ జంక్షన్, టవర్ సర్కిల్ ఆధునీకరణ, పాఠశాలలో స్మార్ట్ ఈ క్లాస్ రూమ్స్, ఆధునీకరణ, సైనేజస్ తదితర ప్రాజెక్టుల పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు ప్రాజెక్టుల పనులు కూడ త్వరగా ప్రారంభం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ యాదగిరి, డీఈ ఓం ప్రకాష్, లచ్చిరెడ్డి, అయూభ్ ఖాన్, వెంకటేశ్వర్లు, సతీష్, పీఎంసి అధికారి సందీప్ పాల్గొన్నారు.