calender_icon.png 22 September, 2024 | 5:02 PM

మోడల్ స్కూళ్లలో చకచకా బదిలీలు!

16-09-2024 03:54:29 AM

  1. వెంటనే జాయినింగ్ కావాలని ఆదేశాలు
  2. ఒకేరోజు ట్రాన్స్‌ఫర్స్, జాయినింగ్స్
  3. బదిలీ పాఠశాలలో టీచర్లు, ప్రిన్సిపాల్స్ రిపోర్టింగ్ 
  4. పదకొండేళ్ల తర్వాత బదిలీలకు మోక్షం
  5. మొత్తం 2,757 మంది సిబ్బంది బదిలీ

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): మోడల్ స్కూళ్లలోని ప్రిన్సిపాల్స్, పోస్ట్ గ్రాడ్యు యేట్ టీచర్లు(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ) బదిలీల ప్రక్రియను అధికారులు చక చకా పూర్తి చేశారు. శనివారం ఉదయం 6 గంట లకు బదిలీల ఆర్డర్స్ ఇచ్చి అదేరోజు జాయిన్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. జాయినింగ్‌కు అదనంగా ఒక్క రోజు కూడా అవకాశం ఇవ్వలేదు.

తెల్లవారుజామున పాఠశాలల మెయిల్స్‌కు బదిలీల ఉత్తర్వులను పంపించిన అధికారులు వెనువెంటనే ఆయా పాఠశాలల్లో బదిలీలైన టీచ ర్లు, ప్రిన్సిపాల్స్ జాయిన్ కావాలని ఆదేశా లివ్వడంతో దాదాపు అందరూ జాయిన్ అయ్యా రు. రాష్ట్రంలోని 195 మోడల్ స్కూళ్లలో ప్రిన్సి పాల్స్, పీజీటీ, టీజీటీ టీచర్స్ కలిపి మొత్తం 2,757 మంది బదిలీలయ్యారు. ఇటీవల న్యాయ పరమైన చిక్కులు తొలగిపోవడంతో బదిలీలకు మోక్షం లభించింది.

మళ్లీ బ్రేక్ పడొద్దని..

మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు పదకొండేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేక పోవడంతో వారు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతూ వచ్చారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా బదిలీలు కాలేదు. తొలి రోజు ఉద్యోగంలో ఎక్కడైతే చేరా రో అదేచోట ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ అవసరాల నేపథ్యంలో తమకు బదిలీలు చేపట్టాలని గత మూడు నాలు గేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్పం దించిన ప్రభుత్వం గతేడాది 2023 జూలై 3న బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేసి ప్రక్రియను కూడా చేపట్టింది.

అయితే మోడల్ స్కూళ్లలో 2013, 2014లో రెండు సార్లు ఉపాధ్యాయులు నియమితులయ్యారు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు సర్వీస్ పాయింట్ల కేటాయింపు అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయ డంలో కోర్టు అప్పట్లో స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. తాజాగా ఈనెల 12వ తేదీన హైకోర్టు దీనిపై విచారణ చేపట్టి ఉపాధ్యా యులు 2013, 2014లో చేరినా సీనియారిటీ మెరిట్ ప్రకారం సీనియారిటీ జాబితా తయారు చేసి బదిలీలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశా లివ్వడంలో అధికారులు ఆ ప్రక్రియను ఒక్క రోజులోనే పూర్తి చేశారు.

దీనిపై మళ్లీ ఎవరైనా న్యాయ స్థానం మెట్లు ఎక్కుతారేమోననే ఉద్దేశం తో పదకొండేళ్ల నిరీక్షణకు ఒక్క రోజులోనే తెర దింపారు. అయితే 2757 మందిలో దాదాపు అందరూ శనివారం రోజే స్కూళ్లలో రిపోర్టింగ్ చేయగా, మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అతికొద్ది మంది టీచర్లు రిపోర్టింగ్ చేయలేదని తెలిసింది. బదిలీల ప్రక్రియ ముగిసిపోవడంతో ఇక వీరికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. త్వరలోనే  ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించారు.

ప్రభుత్వ చొరవతోనే సాధ్యమైంది 

గత ప్రభుత్వం పదేళ్లుగా మోడల్ స్కూల్ టీచర్లను పట్టించుకోలేదు. పదకొండేళ్లుగా బదిలీలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాము. ఇన్నేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల చొరవతోనే ఇది సాధ్యమైంది. కోర్టులో కేసులున్నా ఎంతో సంయమనాన్ని టీచర్లు పాటించారు. బదిలీలు చేపట్టడంతో టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మె ల్సీ నర్సిరెడ్డి, అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు.

 బి.కొండయ్య, టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ అధ్యక్షుడు

పదోన్నతులు కల్పించాలి 

హైకోర్టు ఆదేశాలకనుగుణంగా బదిలీలు ప్రక్రియను చేపట్టడం హర్షించదగ్గ విషయం. ఒక్క రోజులోనే పూర్తి చేశారు. 11 ఏళ్లుగా ఈ బదిలీల కోసం తాము ఎంతగానో ఎదురుచూశాం. ఎట్టకేలకు బదిలీలు చేపట్టడంతో ఇక త్వరలోనే పదోన్నతులు కూడా కల్పించాలి.

 భూతం యాకమల్లు, టీఎంఎస్‌టీఏ అధ్యక్షుడు