హీరో రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కావ్య థాపర్ నటిస్తోంది. సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. అలీ, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మాతలు.
సినీ ప్రియులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఈరోజు నుంచి 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్కింగ్ చేస్తూ రామ్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ; స్టంట్స్: కేచ, రియల్ సతీశ్; సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియానీ జియాన్నెలి.