calender_icon.png 28 September, 2024 | 4:50 AM

స్మార్ట్ సిటీ పనులను త్వరగా పూర్తి చేయాలి

28-09-2024 12:40:07 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు

మార్చిలోగా పూర్తి: దాన కిశోర్

కరీంనగర్ స్మార్ట్ సిటీపై సమీక్షా సమావేశం

కరీంనగర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి పొన్న ప్రభాకర్ ఛాంబర్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేష న్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్‌తో కలిసి కరీంనగర్ స్మార్ట్ సిటీపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో కరీంనగర్ మేయర్ యాదగిరి సునీ ల్‌రావు, స్మార్ట్ సిటీ ఎండీ, కమిషనర్ చాహాత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ప్రపూల్ దేశా య్, ఎంఐయూడీ అధికారిణి ప్రియాంక, ఇత ర అధికారులు హాజరయ్యారు. 24 అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. పనులపై తీర్మానం చే శారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 

స్మార్ట్ సిటీ పెండింగ్ పను లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆ దేశించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో మొత్తం 47 పనులు ప్రారంభించగా 25 పనులు పూర్తయ్యాయని, 20 పనులు నడుస్తున్నాయని చెప్పారు. రెండు పనులు ప్రారంభం కాలేదన్నారు. అంబేద్కర్ స్టేడియంలో చేపట్టిన పనులు నెలరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

స్మార్ట్ సిటీలో భాగంగా పూర్తయిన పాఠశాలల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్‌లో కొన్న జంక్షన్‌లు అభివృద్ధి చేశారని, కొన్ని జంక్షన్‌లకు అనుమతి లేకుండా ఇష్టారీతిన అంచనా విలువ పెంచారని వాటి వివరాలు సేకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిశోర్‌ను ఆదేశించారు.

నగరంలో ఉన్న డంపింగ్ యార్ట్ విషయంలో పీఏంసీపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన విధానాలు పాటించకపోవడం వల్లే మంటలు అంటుకున్నాయన్నారు. వీటితో పాటు ఇతర అభివృద్ధి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. కాగా కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు రాష్ర్ట ప్రభుతం నుంచి రావాల్సిన రూ.61 కోట్ల గురించి స్మార్ట్‌సిటీ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. నిధుల విడుదలకు దాన కిశోర్ హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీలో చేపట్టిన ప్రాజెక్టుల వేగవంతంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని బోర్డు డైరెక్టర్లకు దాన కిశోర్ సూచించారు.